Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులకు సుప్రీం సూచన
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో అమలు చేయడం సాధ్యం కాని ఆదేశాలను ఇవ్వొద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లో అన్ని నర్సింగ్ బెడ్లకు నాలుగు నెలల్లోగా ఆక్సిజన్ సదుపాయం కల్పించాలన్న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై శుక్రవారం స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ సూచన చేసింది. బెడ్లకు ఆక్సిజన్ కొరతను సుమోటాగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు పైవిధంగా ఆదేశాలు జారీచేసింది. ఒక నెలలోగా యుపిలోని ప్రతి గ్రామంలో రెండు అంబులెన్స్‌లు, ఐసియు సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అమలయ్యేందుకు వీలయ్యే ఆదేశాలు మాత్రమే ఇవ్వాలని జస్టిస్ వినీత్ శరన్, బిఆర్ గవారులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఆరోగ్య వ్యవస్థ దయనీయ పరిస్థితులపై సోమవారం అలహాబాద్ హైకోర్టు స్పందిస్తూ.. అంతా దేవుని దయ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రద్దు చేయాలన్న వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. అటువంటి వ్యాఖ్యలను సూచనలుగా మాత్రమే పరిగణించాలని పేర్కొంది.