Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : ఊరంతా తిరిగి ఇంట్లో చతికిల పడినట్లు అన్న సామెత..బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిపోతుంది. రాష్ట్రం మొత్తం మమతా హవాతో తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించగా...ఆమె మాత్రం తాను పోటీకి దిగిన నందిగ్రామ్ నియోజకవర్గంలో గెలవలేకపోయారు. అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటికీ..ఆరు నెలల్లోగా ఆమె శాసనసభ సభ్యునిగా ఉండి తీరాలి. దీంతో ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సువేందు అధికారి సవాలు విసిరేందుకు తన కంచుకోట భవానీపూర్‌ను వదులుకున్న మమత...ఇప్పుడు ఆ స్థానం నుండి గెలుపొందాని చూస్తున్నారని వినికిడి. అక్కడ గెలిచిన తృణమూల్ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ...ఆ పదవికి త్వరలోనే రాజీనామా చేసి....తమ బాస్‌కు మార్గం సుగమం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాబట్టి...ఆ స్థానం నుండి ఆమె పోటీ చేయనున్నారని సమాచారం.