Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పంజాబ్లో ఘోర ప్రమాదం జరిగింది. మిగ్-21 ఎయిర్క్రాఫ్ట్ కూలడంతో భారత వైమానిక దళానికి (ఐఎఎఫ్)కు చెందిన పైలట్ మరణించారు. మోగా జిల్లాలోని గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగిందని ఐఎఎఫ్ ట్విట్టర్లో వెల్లడించింది. జిల్లాలోని లాంగియాన ఖుర్డ్ గ్రామంలో మిగ్ 21 ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. రోజువారీ శిక్షణలో భాగంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూలిందని అధికారులు చెబుతున్నారు. ' పశ్చిమ సెక్టార్లో ఐఎఎఫ్కు చెందిన బిసన్ ఎయిర్ క్రాఫ్ట్ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఇందులో పైలట్, స్వాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి..తీవ్రంగా గాయపడి..మరణించారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ...ఆయన కుటుంబానికి అండగా నిలుస్తాం' అని ఐఎఎఫ్ ట్వీట్ చేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆఫ్ ఎంక్వైరీ (సిఒఐ) ఆదేశించింది. కాగా, ఈ ఏడాది మిగ్-21 విమాన ప్రమాదం జరగడం ఇదో మూడవసారి.