Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశీయ, అంతర్జాతీయ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, చరిత్రకారులు, కళాకారుల డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సష్టిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణం నిలుపు చేయాలని పలు దేశీయ, అంతర్జాతీయ యూనివర్సిటీల అధ్యాపకులు, చరిత్రకారులు, కళాకా రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు పనులను నిలిపేసి కరోనాపై సమర్ధవంతమైన పోరు చేసేందుకు దృష్టి పెట్టాలని సూచించారు. అత్యవసర సేవల పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేర్చిన నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టు ప్లాన్‌పై మళ్లీ పరిశీలన జరగాల్సిన అసవరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగించడం కార్మికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని పేర్కొన్నారు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ), నేషనల్ ఆర్చీవ్స్ అనెక్స్లను పడగొట్టి వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టడంపై అభ్యంతర వ్యక్తం చేశారు. ఉదా హరణకు మ్యూజియంలోని వస్తువులను ఎక్కడ ఉంచుతారు, ఎలా తరలిస్తారు అన్నదానిపై వివరణ లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా భారీ పార్లమెంట్‌ను నిర్మించుకొని, బహిరంగ స్థలాలను ఆఫీస్ బ్లాక్‌లుగా మార్చాలని యోచిస్తున్నారు. తద్వారా ఢిల్లీ ప్లానింగ్‌ను, ప్రపంచ వారసత్వ సంపదను నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత సంస్థలు, చారిత్రక, వారసత్వ సంపదకు సంబంధించి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకు పోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో రామచంద్ర గుహ (ప్రఖ్యాత చరిత్రకారుడు), జెఎన్‌యుకి చెందిన నామన్ అహుజా, సేన్ అండర్సన్ (మ్యూజియం ఆఫ్ మోడర్న్ అర్ట్), ఎర్నెస్టు వాన్ అల్పేన్ (లీడెన్ యూనివర్సిటీ), అర్జున్ అప్పాదురై (న్యూయార్క్ యూనివర్సిటీ), జాన్ హెచ్.బౌల్స్ (రచయిత), అర్పనా కౌర్ (ఢిల్లీకి చెందిన కళాకారుడు), ప్రేమ్ చందవర్కార్ (ఆర్కిటెక్ట్-బెంగళూరు), అన్నపూర్ణ గరిమెళ్ల ఉన్నారు.