Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)కు చెందిన ఆన్లైన్ సేవలు ఆదివారం నాడు 14 గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఇంట ర్నెట్ బ్యాంకింగ్, ఎస్బిఐ యోనో, ఎస్బిఐ యోనో లైట్ సేవలు అందుబాటులో ఉండవని ఆ బ్యాంక్ వెల్లడించింది. శనివారం (మే 22) బ్యాంకింగ్ లావాదేవీల కాలం ముగిసిన తర్వాత నిఫ్ట్ సిస్టమ్స్‌ను సాంకేతికంగా అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో అర్థరాత్రి 12:01 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఖాతాదారులకు అన్లైన్ సేవలు లభించవని పేర్కొంది. ఆర్బిఐ ఈ నెల 22న బ్యాంకింగ్ బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత నిఫ్ట్ సిస్టమ్స్ అప్‌గ్రెడేషన్ ప్రక్రియ చేపడుతుందని ఎస్బిఐ తెలిపింది. ఈ ప్రక్రియ వల్ల ఎస్బిఐ ఖాతాలతో అనుసంధానం కలిగిన గూగుల్‌పే, ఫోన్ పే, పేటియం తదితర యుపిఐ డిజిటల్ చెల్లింపు సేవలకు అంతరాయం కలుగనుంది. కాగా ఆర్టిజిఎస్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.