Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆన్లైన్లో బీమా పాలసీ సేవలను అందించే అగ్రిగేటర్ పాలసీ జజార్కు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డిఎ రూ.24 లక్షల జరిమానా విధించింది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం పెరుగుతుందంటూ ఖాతాదారులను ఆందోళనకు గురి చేసింది. ఈ విషయమై గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 7 మధ్య 10 లక్షల మంది ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా నిబంధనలు ఉల్లఘించిందని ఐఆర్డిఎ తెలిపింది. దీంతో ప్రకటనల నిబంధనలను పాలసీబజార్ ఉల్లంఘించినట్టు ఐఆర్డిఎఐ గుర్తించింది. ప్రీమియం ధరలు పెరుగుతున్నాయంటూ తప్పుదోవ పట్టించడంతో పాటు, నిబంధన 11, 9లను ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది. పలు బీమా సంస్థలు టర్మ్ పాలసీలపై ప్రీమియం పెంచు తున్నట్లు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఖాతాదారులను అప్రమత్తం చేయడానికి సందేశాలు పంపించామని పాలసీ బజార్ పేర్కొంది.