Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీతి ఆయోగ్ సభ్యుడు వికె.పాల్
న్యూఢిల్లీ : ప్రస్తుతానికి 45 సంవత్సరాలు, ఆపై వయసు ఉన్నవారికి వ్యాక్సిన్ అందించడమే కేంద్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతగా ఉందని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వికె పాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ నిల్వలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో 18 ప్లస్ కేటగిరీ వారికి వ్యాక్సిన్ వేయడాన్ని నిలిపేస్తామని సిఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నకు పాల్ పైవిధంగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను ఎవరికి ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులే నిర్ణయించుకోవాలని అన్నారు. క్రాస్ వ్యాక్సినేషన్ శాస్త్రీయంగా, సిద్ధాంతపరంగా సాధ్యమేనని, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని సిఫార్సు చేయడం సాధ్యం కాదని తెలిపారు.