Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో సెకండ్ వేవ్ కరోనా ప్రాణ దాతల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ దశలో సుమారు 420 మంది వైద్యులను మహమ్మారి బలి తీసుకుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) శనివారం వెల్లడించింది. ఒక్క ఢిల్లీలోనే 100 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని డేటాలో తెలిపింది. సెకండ్ వేవ్‌లో ఇదే అత్యధిక మరణాలుగా పేర్కొంది. దీని తర్వాత స్థానంలో బీహార్ నిలిచింది. ఇక్కడ 96 మంది మరణించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, గుజరాత్లో 31 మంది, మహారాష్ట్రలో 15 మంది డాక్టర్లు వైరస్‌కు బలయ్యారు. ఈ డేటాలో తొలివేవ్‌లో 747 మందిని కోల్పో యినట్లు తెలిపింది. తమిళనాడులో ఎక్కువగా 91 మంది మరణించారని తెలిపింది. తర్వాత మహారాష్ట్రలో 81, ఆంధ్రప్రదేశ్ 70, బీహార్‌లో 38 మంది, అసోం 20 మంది కోవిడ్ బారిన పడి చనిపోయినట్లు తెలిపింది.