Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏయిరిండియా వెల్లడి
న్యూఢిల్లీ : ఏయిర్‌లైన్ డేటా ప్రాసెసర్‌పై జరిగిన సైబర్‌దాడుల్లో దాదాపు 45 లక్షల మంది ప్రయాణీకుల వ్యక్తిగత సమాచారం లీకైందనీ ఏయిరిండియా ఒక ప్రకటనల్లో తెలిపింది. అయితే కాంప్రమైజ్డ్ సర్వర్లు అనంతరం భద్రపర్చబడ్డాయని పేర్కొన్నది. 2011 నుంచి 2021 ఫిబ్రవరి మధ్య రిజిస్టరయిన ప్రయాణికుల పేరు, ఫోన్ నంబర్, పాస్‌పోర్టు, టికెట్, క్రెడిట్ కార్డు సమాచారం వంటివి తస్కరణకు గురయ్యాయని ఏయిర్‌లైన్స్ తెలిపింది. అయితే, పాస్వర్డులు మాత్రం ప్రభావితం కాలేదని చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ సైబర్ దాడికి సంబంధించిన సమాచారాన్ని ఏయిరిండియా డేటా ప్రాసెసర్ సిటా పీఎస్ఎస్ (ప్యాసింజర్ సర్వీస్ సిస్టం) ఏయిర్లైన్కు వివరించగా దీనిపై సంస్థ విచారణ జరిపింది. కాంప్రమైజ్డ్ సర్వర్లను సెక్యుర్ చేశారు.