Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఓ ముడుపుల కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సిబిఐ క్లీన్చిట్ ఇచ్చింది. పలు అవినీతి కేసుల్లో మూడేళ్లకు పైగా జైలులో ఉన్న ఆయన ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. డిఎల్ఎఫ్ అనే రియల్ఎస్టేట్ సంస్థ...లాలూకు మధ్య జరిగిన అవినీతిపై 2018లో సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ముంబయిలోని బాంద్రా రైల్ ల్యాండ్ లీడ్ ప్రాజెక్టు, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ అభివృద్ధి ప్రాజెక్టులను డిఎల్ఎఫ్ గ్రూప్‌కు అప్పగిచేందుకు 2007లో అప్పటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాలూకు దక్షిణ ఢిల్లీలోని విలువైన ఆస్తులను కట్టబెట్టిందన్న ఆరోపణలపై ఈ విచారణ ప్రారంభమైంది. ఎబి ఎక్స్పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ అనే డొల్ల కంపెనీ...దక్షిణ ఢిల్లీలోని రూ. 5 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసింది. దీనికి డిఎల్ఎఫ్, మరో కొన్ని డొల్ల కంపెనీలు నిధులు సమకూర్చాయి. కాగా, దాని వాస్తవ విలువ రూ. 30 కోట్లు కాగా, 2011లో లాలూ కుటుంబ సభ్యులకు నామమాత్రపు ధరలకే రూ. 5 కోట్లకు కట్టబెట్టారని సిబిఐ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై ఎటువంటి సాక్ష్యాధారాలు లభించనందున ఆ ప్రాథమిక విచారణ నిలిపివేసినట్లు అధికారులు తెలపడంతో.. లాలూకు సిబిఐ క్లీన్చిట్ ఇచ్చింది.