Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ
న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్‌లో చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రధానికి ఆమె లేఖ రాశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే 'ఆంఫోటెరిసిన్-బి' ఔషధం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్లాక్ ఫంగస్‌గా పేర్కొంటున్న మ్యూకోర్ మైకోసిస్ చికిత్సను ఉచిత వైద్య పథకం ఆయుష్మాన్ భారత్, తదితర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.