Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు : కరోనాకు చికిత్స పేరుతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య చేస్తున్న నాటువైద్యం వికటించింది. ఈ వైద్యం వల్ల కలిగిన దుష్పరిణామాలతో శనివారం ఐదుగురు నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య కూడా వీరిలో ఉన్నారు. ఈ మందుకు ఎటువంటి శాస్త్రబద్దత లేని విషయం వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల పరిశీలనకు ఆదేశించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేంద్రబృంద పరిశీలనకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశోధనలు పూర్తిస్థాయిలో ఇంకా ప్రారంభం కాకుండానే దుష్పరిణామాలతో మందు తీసుకున్న వారు ఆసుపత్రుల్లో చేరడం ప్రారంభం అయ్యింది. ఆస్పత్రులలో చేరుతున్న వారిలో కళ్లు మంటలు, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.