Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్రలోని తౌక్టే తుఫాన్ ధాటికి అతలాకుతలమైన కొంకణ్ ప్రభావిత ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సందర్శించిన వ్యవధిపై బీజేపీ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తాను తుఫాను అనంతరం ధరణిపై పరిస్థితి గురించి తెలుసుకున్నానని, ఫోటో సెషన్ కోసం హెలికాఫ్టర్లో ఏరియల్ సర్వే చేపట్టలేదని ప్రధాని మోడీనుద్దేశించి ఎద్దేవా చేశారు. తౌక్టే తుఫాన్ తీరం దాటిన అనతంరం మోడీ గుజరాత్లో ఏరియల్ సర్వే చేపట్టిన సంగతి విదితమే. ఉద్ధవ్ శుక్రవారం..రత్నగిరి, సింధుదర్గ్ జిల్లాలను సందర్శించి...పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం అంచనా వేసి... పూర్తి వివరాలు రెండు రోజుల్లో అందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. కేవలం మూడున్నర గంటల పాటు మాత్రమే ఆయన కొంకణ్ ప్రాంతాల్లో పర్యటించారని, రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందంటూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఉద్ధవ్ కనీసం అక్కడ ఏం జరిగిందో నాలుగు గంటల్లో తెలుసుకోగలిగానని, ఫోటో సెషన్ కోసం ఏరియల్ సర్వేలో పాల్గొనలేదంటూ...ప్రధాని మోడీనుద్దేశించి కౌంటరిచ్చారు.