Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో తొలి వేవ్‌తో పోల్చుకుంటే సెకండ్‌వేవ్‌లో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా...మరణాలు మాత్రం నాలుగు వేలకు తగ్గడం లేదు. మరణాల సంఖ్య మూడు లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2.57 లక్షల కేసులు నమోదు కాగా, 4,194 మంది మరణించారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశంలో 2,62,89,290 మంది కరోనా బారిన పడగా...2,95,525 మరణాలు సంభవించాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 3,57,630 మంది కోలుకోగా, 2,30,70,365 మంది డిశ్చార్జి అయ్యి ఇండ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,23,400 క్రియాశీలక కేసులున్నాయి. తమిళనాడులో 36,184 కేసులు, కర్నాటక 32,218, కేరళ 29,673, మహారాష్ట్ర 29,644, ఆంధ్రప్రదేశ్ 20,937 కేసులు నమోదయ్యాయి.