Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: .దేశంలో రెండో దశ విజంభన తర్వాత అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించే తొలి రాష్ట్రంగా దేశ రాజధాని ఢిల్లీ నిలవనున్నది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31 నుంచి రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. అయితే, ఒకేసారి లాక్ డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదనీ, క్రమంగా నిబంధనలను సడలిస్తామని చెప్పారు. కాగా, ఢిల్లీ ప్రజల స్పందన ఆధారంగా మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 31 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందన్నారు. గత నెల రోజులుగా సహకరిస్తున్నట్లుగే, ఈ వారం ప్రజలు కఠినంగా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత బడ్జెట్ అయినా ఖర్చు పెడతామని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతంగా వ్యాక్సిన్ వేయడమే తమ ప్రథమ లక్ష్యమన్నారు. మూడు నెలల లోపు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.