Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయాందోళనకు గురికావద్దన్న సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగు తోంది. ఇలాంటి తరుణంలో కరోనా నుంచి కోలుకున్నవారు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బారినపడుతుం డటంతో సర్వత్రా భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ (మ్యూకోర్‌మైసిస్) కేసులను నివేదించాయి. మరణాలు సైతం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్లాక్ ఫంగస్‌పై మెడికల్ ఆడిట్‌ను నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ''బ్లాక్‌ఫంగస్‌పై మెడికల్ ఆడిట్‌ను నిర్వహిస్తాం. దీని చికిత్సకు సంబంధించి ఖర్చుతో సంబంధం లేకుండా మెరుగైన మందులను అందుబాటులో ఉంచుతాం'' అని అన్నారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్పై అనేక అశాస్త్రీయమైన, ప్రజలను భయపెట్టే సందేశాలు ప్రస్తుతం వ్యాప్తిస్తున్నా యన్నారు. మ్యూకోర్‌మైసిస్‌గా పిలువబడే బ్లాక్‌ఫంగస్ ఇన్ఫెక్షన్ చాలా అరుదైన వ్యాధి అనీ, ఇది దేశంలో కొత్తగా కనుగోనబడిన వ్యాధి కాదనీ, చాలా రోజుల క్రితమే ఉందన్నారు. దీనికి వైద్యం అందుబాటులో ఉందనీ, ప్రజలు భయాందోళ నకు గురికావద్దని పినరయి విజయన్ తెలిపారు. అలాగే, రాష్ట్రంలో 15బ్లాక్ ఫం గస్ కేసులు నమోదయినట్టు నివేదికలు అందుతున్నాయనీ, దీని బారినపడ్డ వారి కి మెరుగైన చికిత్స అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.