Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్ష విధానాలపై రాష్ట్రాల బోర్డులతో కేంద్రం చర్చలు
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించడానికే కేంద్రం మొగ్గు చూపుతోంది. సీబీఎస్ఈ బోర్డు కూడా పరీక్షల్ని నిర్వహించాలని భావిస్తోంది. పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్రమంత్రుల కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విద్యాశాఖా మంత్రి పోఖ్రియాల్తోపాటు అన్ని రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులు హాజరయ్యారు. ఈసందర్భంగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణకే వీరందరూ మొగ్గు చూపారు. కరోనా కారణంగా పన్నెండో తరగతి పరీక్షలు కొన్ని రోజుల క్రితం వాయిదాపడ్డాయి. సెకండ్ వేవ్ కారణంగా పరీక్షల్ని రద్దు చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అయితే పరీక్షల నిర్వహణకే సీబీఎస్ఈ, కేంద్రం మొగ్గుచూపాయి. జులైలో పరీక్షలు నిర్వహించడానికి బోర్డు సిద్ధమైనట్టు సమాచారం. ఈ నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ జూన్ ఒకటో తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. తాజా భేటీలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్రం ముందు సీబీఎస్ఈ బోర్డు రెండు ఆప్షన్లను ముందుంచింది. అందులో మొదటిది..పరీక్షల పద్ధతిని పూర్తిగా ఆబ్జెక్టీవ్ ఫార్మాట్లో నిర్వహించటం. తద్వారా పరీక్ష సమయం 1 గంటా 50 నిమిషాలకు కుదించ వచ్చునని బోర్డు పేర్కొంది. ఇక రెండో పద్ధతి..కేవలం ముఖ్యమైన సబ్జెక్టులపైనే పరీక్షలు నిర్వహించడం. మిగిలిన సబ్జెక్టుల విషయంలో ఇంటర్నల్ అసైన్మెంట్ ఆధారంగా మార్కులు నిర్ణయించాలని బోర్డు సూచించింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాల్ని కేంద్రం కోరినట్టు తెలిసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.