Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీకి భారీగా తరలిన రైతులు.. 12 ప్రతిపక్షాల మద్దతు
చండీగఢ్: నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసన కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు పూర్తవు తున్న నేపథ్యంలో 26న 'బ్లాక్ డే' పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హర్యానా లోని కర్నల్ జిల్లా నుంచి పెద్దఎత్తున రైతులు ఢిల్లీకి తరలివెళ్లారు. భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత గుర్నామ్ సింగ్ నేతృత్వంలో వందలాది వాహనాల్లో వీరంతా ఆదివారం ఢిల్లీ సరిహద్దులోని దీక్షాస్థలికి బయల్దేరారు. 'బ్లాక్ డే' నిరసనలో భాగంగా వారంపాటు ఢిల్లీ సరిహద్దుల్లో సామూహిక ఆందోళనలు చేపట్టనున్నారు. పంజాబ్ నుంచి కూడా పెద్దసంఖ్యలో రైతులు బయల్దేరారు. కాగా 12 ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. సంయక్తుప్రకటనపై సంతకం చేసిన వారిలో సోనియాగాంధీ(కాంగ్రెస్) సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి,డి.రాజా (సీపీఐ) మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ,శరద్‌పవార్(ఎన్సీపీ) మమతబెనర్జీ(తృణమూల్)ఉద్ధవ్ థాక్రే (శివసేన) ఎంకె స్టాలిన ్(డీఎంకే).హేమంత్‌సోరెన్(జేఎంఎం) ఫారుఖ్ అబ్దుల్లా(ఎన్సీ),అఖిలేశ్ యాదవ్(ఎస్పీ)తేజస్వీ యాదవ్(ఆర్జేడీ)లు ఉన్నారు.