Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపూర్ణవ్యాక్సిన్తో వేరియంట్లకు బ్రేక్
- యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఇప్పటివరకూ మనతోనే ఉన్నదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. మహమ్మారి వృద్ధి, పరివర్త నం చెందుతున్నదన్నారు. అలాగే, ఇటీవల భారత్, దక్షణ అమెరికా, ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల గురించి ఆయన ప్రస్తావించారు. గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిఒక్కరూ అప్రమత్తతతో ఉండే వరకు ఏ ఒక్కరూ భద్రతగా ఉండరని హెచ్చరించారు. పేద దేశాలు వ్యాక్సిన్లు, పరీక్షలు, మందులతో పాటు ఆక్సిజన్ సరఫరా విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. వైరస్‌తో మనమంతా యుద్ధం చేస్తున్నామన్నారు. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో జీ-20 దేశాలు ముందుకు రావాలని తాను అభ్యర్థిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర వేరియంట్లను నిరోధించాలంటే వేగవంతమైన, సంపూర్ణమైన వ్యాక్సిన్లే మార్గమని గుటెర్రస్ నొక్కి చెప్పారు.