Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి సత్వర అనుమతులకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ స్వదేశీ కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉన్నత దౌత్యవేత్తలు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం నేడు (సోమవారం) విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా భారత్ బయోటెక్ అధికారుల్ని కలవనున్నారు. కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి తీసుకురావడంపై వీరు చర్చించనున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే అక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనికా, ఫైజర్, మెడెర్నా వంటి వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతున్నాయి. దీంతో ఈ టీకాల గ్రహీతలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతించబడుతున్నారు. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు కూడా డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చింది. డబ్ల్యూహెచ్ఓ అనుమతి లేకపోతే భారతీయ టీకాలు వేసుకున్నవారిని అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతించరు. డబ్ల్యూహెచ్ఓతో పాటు ఇయు అనుమతి కూడా లభిస్తే వ్యాక్సిన్ అభివృద్ధికి, తయారీకి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.