Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధిస్తున్న మౌలిక సదుపాయల, సిబ్బంది కొరత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ విజంభణలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి సమయంలో అక్కడ ఉన్న ఆసుపత్రుల్లో తగిన వైద్య మౌలిక సదుపాయాలు లేక కరోనాపై పోరులో కొట్టుమిట్టా డుతున్నాయి. ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులతో కూడిన విస్తారనమైన నెట్‌వర్క్‌ను కనీస ప్రాథమిక సౌకర్యాలు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. స్థానికంగా ఉండే ప్రజల సంరక్షణ కోసం గత కొన్నేళ్లుగా జిల్లాల్లో మూడంచెల ఆరోగ్య వ్యవస్థ ఉంది. అయితే పాలకుల నిర్లక్ష్యం, తగిన నిధుల కేటాయింపు చేయకపోవడం వలన ఇవి మౌలిక సదుపాయాల పరంగా అభివద్ధి చెందలే కపోయాయి. ఇదే సమయంలో తగినంత మంది వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిని నియమించకుండా తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం కరోనా రెండో దశలో వైరస్ బారిన పడుతున్న ప్రజలను రక్షించ డంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. జిల్లాల్లో ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పిహెచ్సి), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సిహెచ్సి) అనే మూడంచెల ఆరోగ్య వ్యవస్థ ఉంది. జనాభా పెరిగే కొద్దీ.. పలు రోగాలు, ఆనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో వారందరికీ చికిత్స అందిచే సామర్ధ్యం వీటికి తగ్గిపోయింది. పలు ఆసుపత్రుల్లో కనీసం సదుపా యాలపై తాగునీరు, విద్యుత్, ఆపరేషన్ థియేటర్లు, సరిపడా బెడ్లు, ఎక్స్‌రే మిషన్లు వంటి కూడా లేని దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆరోగ్య సిబ్బంది ఎక్కు వగా ఉండగా, ఇదే సమయంలో అధిక రాష్ట్రాల్లో సిబ్బంది సరిపడా లేరు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లోని ఈ ఆసుప త్రుల్లో స్పెషలిస్టులు, టెక్నీషియన్ల కొరత వెంటాడుతోంది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆరోగ్య ఉపకేంద్రాలు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు లేవు. ఈ మూడంచెల ఆరోగ్య వ్యవస్థను వరుసగా 5 వేలు, 30 వేలు, లక్ష 20 వేల జనాభాకు సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. అయితే వాస్తవానికి వాటికి కేటాయించిన జనాభా కంటే ప్రస్తుతం ఆయా ప్రాంతాల పరిధిలో జనాభా పెరిగింది, అందుకు అనుగుణంగా ఆసుపత్రులను పెంచగా, లేదా ఉన్న ఆసుపత్రుల్లోనే సదుపాయాలను మెరుగుపరిచే చర్యలు కనిపించడం లేదు. కొత్త ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించనట్లయితే, ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్య సేవలను అందించడంలో ఆలస్యం, అది కూడా మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుతుందన్న హామీ లేని కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొఇ ప్రైవేట్ ఆసుపత్రులకు పరిగెడుతున్న పరిస్థితి నెలకొంది. అక్కడేమో అదిక ఫీజుల కారణంగా పేదల జేబులు గుల్లవుతున్నాయి.
మౌలిక సదుపాయాల లేమి
దేశంలో ఉన్న 4 శాతం ఆరోగ్య ఉపకేంద్రాలు, 13 శాతం పిహెచ్‌సిలు, 90 శాతం సిహెచ్‌సిలు మాత్రమే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(ఐపిహెచ్ఎస్) ప్రమా ణాలు ఉన్నాయని ప్రభుత్వ నివేదిక ఒకటి పేర్కొంది. 44 వేల ఉపకేంద్రాలు, వెయ్యి పిహెచ్‌సిల్లో విద్యుత్ సదుపా యం లేకపోగా, 23 వేల ఉపకేంద్రాల్లో నీటి సరఫరా వ్యవస్థ కూడా లేకపోవడం గమనార్హం.25 వేల పిహెచ్ సి(28శాతం)ల్లో గర్భిణులకు సుఖ ప్రసవం అందిచేందుకు ఆపరేషన్ ధియేటర్లు కూడా లేని పరిస్థితి. 30 శాతం పిహెచ్సిల్లోఇన్ పేషెంట్లకు కనీసంగా ఉన్న ఉండాల్సిన నాలుగు బెడ్లు కూడా లేవు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలలేమితో పాటు ప్రధానంగా సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఇది డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఎఎన్ఎం, తదితర సిబ్బంది పరంగా ఉంది. ఉదాహరణకు బీహార్‌లో పిహెచ్‌సిలకు ప్రభుత్వం 4,129 వైద్యుల పోస్టులను కేటాయించగా, వీటి ల్లో కేవలం 1,745 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. కేటాయించిన పోస్టుల్లో ఇంకా 58 శాతం కొరత ఉంది. ఇక సిహెచ్సిలో స్పెషలిస్టుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి సిహెచ్సిలో ఫిజిషియన్, సర్జన్, పీడియాట్రిసియన్, గైనకాలజిస్టు వంటి నలుగురు స్పెషలిస్టులు ఉండాలని అనుకున్నా.. దేశమొత్తం మీద సిహెచ్‌సిల్లో 20,732 మంది ఉండాలి. కానీ ప్రభుత్వాలు కేవలం 13,266 పోస్టులను మాత్రమే కేటాయించగా, వాటిల్లో కూడా తక్కువగా 4,957 మంది మాత్రమే భర్తీ అయ్యారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్ర ంలో అయితే దారుణంగా.. అక్కడి సిహెచ్‌సిల్లో 2,844 మంది స్పెషలిస్టులు అవసరం ఉండగా, 816 మందే విధు ల్లో ఉన్నారు. రాజస్థాన్‌లో 2,192కు 438 మంది, మధ్యప్రదేశ్‌లో 1,236కు 46 మంది, గొప్పగా అభివద్ధి చేశా మని బిజెపి నేతలు చెప్పుకునే గుజరాత్‌లోని సిహెచ్‌సిల్లో 1,392 మంది స్పెషలిస్టలు ఉండాల్సి ఉండగా, కేవలం అంటే కేవలం 13 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. సిహెచ్‌సిల్లో 56 శాతం రేడియోగ్రాఫర్లు లేని కారణంగా రోగులకు ఎక్స్‌రేలు కూడా తీయలేని పరిస్థితి. నేషనల్ హెల్త్ మిషన్ కింద గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ మెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం చొప్పున నిధులు కేటాయించాలి. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్రానికే అధికంగా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే అనేక సంవత్సరాలుగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపోలేదు. మోడీ హయాంలో మొత్తం ప్రాముఖ్యత ప్రైవేటు ఆసుపత్రులకు అనుకూలంగా బీమా ఆధారిత మోడల్‌కు మారింది. ప్రభుత్వ ఆసుపత్రులపై వహిస్తున్న ఈ నిర్లక్ష్యం ప్రస్తుతం కరోనా సమయంలో కోట్లాది మంది ప్రజలను పేదరికం, అప్పుల్లోకి నెట్టడమే కాక, ఆ సంక్షోభ సమయంలో ఆరోగ్య సంరక్షణ లేక పేదలను దారుణ స్థితిలో పడేసింది.