Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనపై చర్యలకు డిమాండ్ :కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ
న్యూఢిల్లీ : కరోనా చికిత్సలో భాగంగా అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగ గురువు బాబా రాందేవ్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటువ్యాధుల చట్టం (ఎపిడిమిక్ డిసీసెస్ యాక్ట్) 1897 కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాందేవ్ వ్యాఖ్యలను ఆమోదించి ఆధునిక వైద్యానికి ముగింపు పలకాలని తెలిపింది. '' పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ప్రతిసారీ ఆయన ఇలా మాట్లాడుతున్నారు. అతని అక్రమ ఔషధాల అమ్మకం కోసం ప్రజల్లో భయాన్ని సృష్టిస్తు న్నారు'' అని రాందేవ్‌పై ఐఎంఏ ఆరోపించింది. '' అలాంటి వ్యక్తి యంత్రాంగాన్ని, మొత్తం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్రతను ప్రశ్నిస్తున్నాడు. ఆధునిక వైద్య అల్లోపతిక్ పోస్టు గ్రాడ్యుయేట్, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అధిపతిగా ఉన్న ఆరోగ్య మంత్రి.. ఆ వ్యక్తి (బాబా రాందేవ్) చేసిన సవాలును ఆరోప ణలను ఆమోదించాలి. అలాగే, ఆధునిక వైద్య విధా నాన్ని రద్దు చేయాలి. అలా కాకపోతే, దేశ సార్వభౌ మాధికారంపై వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిని ఎదు ర్కోవాలి. విచారణ జరపాలి. ఇలాంటి అశాస్త్రీ యమైన వ్యాఖ్యల నుంచి లక్షలాది మంది ప్రజలను రక్షించడానికి అంటువ్యాధుల నిరోధక చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలి'' అని హర్షవర్ధన్‌కు రాసిన లేఖలో ఐఎంఏ పేర్కొన్నది. కరోనా కట్టడిలో ఆధునిక వైద్యం విఫలమైందనీ, అది ఒక పనికిమాలినదంటూ రాందేవ్ వ్యాఖ్యలు చేసిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం విదితమే. దీంతో ఈ వ్యాఖ్యల పైనే అత్యున్నద వైద్య సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పై విధంగా స్పందించింది. అంతేకాదు, పతంజలికి సంబంధిం చిన మెడిసిన్స్‌ను విడుదల చేసే క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి సమక్షంలోనే ఆధునిక వైద్యులను '' హంతకులు''గా అభివర్ణించిన రాందేవ్ వ్యాఖ్యలను కూడా ఐఎంఏ ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాగే, రాందేవ్ 'కరోనిల్', స్వసారీ మెడిసిన్ వివాదాలు, వేలాది మంది ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తూ బాధ్యతారా హిత్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఆయ నపై సామాజిక కార్యకర్త తమన్న హష్మీ క్రిమినల్ కంప్లయింట్ చేసిన అంశాన్ని కూడా ఐఎంఏ ఈ సందర్భంగా ఉటంకించింది. రాందేవ్‌తో పాటు ఆయన మిత్రుడు బాలక్రిష్ణ లు జబ్బుపడి నప్పుడల్లా వారు ఆధునిక వైద్యం అల్లోపతిని ఆశ్రయిస్తున్నా రన్నది జగమెరిగిన సత్యమని తెలిపింది.
బాబారాందేవ్‌కు ఐఎంఏ లీగల్ నోటీసు
అల్లోపతిపై బాబారాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఐఎంఏ ఆయనకు లీగల్ నోటీసులు పంపింది. దీనిపై ఆయన నుంచి వివరణ కోరింది. అల్లోపతి వైద్యం, వైద్యులను అవమానించేలా రాందేవ్ మాట్లాడారని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబారాందేవ్ అన్ని హద్లులనూ అతిక్రమించారనీ, ఆయనపై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, ఈ వివాదంపై రాందేవ్ సంస్థ పతంజలి స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఎడిట్ చేసిందని తెలిపింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ఔషధాలను వ్యతిరేకంచే ఆలోచన తమకు లేదని తెలిపింది.