Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంపన్ ప్రభావమంత ఉండకపోవచ్చు! : ఐఎండీ
కోల్‌కతా: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫాన్‌గా మారనుం దన్న వాతావారణ శాఖ హెచ్చరికలు తీరప్రాంతాన్ని వణికిస్తున్నాయి. హెచ్చరికలకు తగినట్టుగానే అల్ప పీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారిం ది. సోమవారం తుఫాన్‌గా మారనుంది. దీంతో దీనికి యాస్ అని పేరు పెట్టారు. యాస్ తుఫాన్ మరింత తీవ్రమై పెను తుపాన్‌గా మారుతుందని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తమిళనాడు, ఒడిషా, పశ్చిమబెంగాల్‌పై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాడే ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం పలుచోట్ల చెదురుమదురు జల్లులు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంది. కోస్తా ప్రాంతంలోని పలు ఇతర జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 26వ తేదీ ఉదయానికి ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతానికి తుఫాన్ చేరుకుంటుందని, అదే రోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాస్‌తో పాటు ఈనెల 26న సముద్రంలో అలల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తుఫాన్ ప్రభావం కూడా కలిస్తే మరింతగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బెంగాల్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేసథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల జిల్లాల అధికార యంత్రాంగాలు కట్టలను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. కట్టల పైనుంచి నీరు గ్రామాల్లోకి ప్రవేశించకుండా వాటి ఎత్తును పెంచుతున్నట్లు బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యాస్ తుఫాన్ నేపథ్యంలో వాటిల్లే విపత్తును ఎదుర్కొనేందుకు ఎక్కువ సంసిద్ధత చర్యలు తీసుకోవాలని తీర ప్రాంత అధికారులను ఎన్డిఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ కోరారు. తక్కువ ప్రభావం ఉండే ప్రాంతాల నుంచి కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
అప్రమత్తంగా ఉండండి : ప్రధాని
'యాస్' తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ సమయంలో ముప్పు ప్రాంతాల ప్రజలతోపాటు ఇప్పటికే కరోనా చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రధాని సూచించారు. తుపాను వల్ల విద్యుత్ సరఫరాకు కలిగిన అంతరాయాలను తొలగించాలని, సకాలంలో స్పందించాలని కోరారు. ఆయా రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని, ఎక్కువగా ఇబ్బందులున్న ప్రాంతాల్లోని ప్రజలను మొదట సురక్షిత ప్రాంతాలకు తరలించాని మోడీ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, టెలికాం, విద్యుత్, పౌర విమానయాన శాఖల అధికారులు పాల్గొన్నారు.