Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు 45 లక్షల మంది వ్యక్తిగత సమచారం లీక్
- డేటా భద్రతకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు అనే సంబంధం లేకుండా సైబర్ దాడులు జరుగుతున్నాయి. తాజాగా భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి జరిగింది. దాదాపు 4.5మిలియన్ల మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. ఈ డేటాలో భారత్‌తో సహా ఇతర దేశాలకు చెందిన ప్రయాణికుల సమాచారం కూడా ఉంది. ఈ డేటా లీక్ ఎయిర్ ఇండియా సర్వర్ నుండి కాకుండా ఎయిర్ ఇండియా సర్వీస్ ప్రొవైడర్ సిటా సర్వర్ నుండి లీక్ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ డేటాపై సైబర్ ఎటాక్ జరిగింది కానీ, ఈ సమచారం ఇప్పుడు లీక్ అయిం ది. సిటా అనేది స్విట్జర్లాండ్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ. సైబర్ దాడి జరిగిన సిటాకు జెనీవాలోనూ ఓ సర్వర్ ఉంది. ఇది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కమ్యూ నికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగి ఉంది. ఎయిర్ ఇండియా ఐటి మౌలిక సదు పాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి 2017లో సిటా తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ ఇండియా లో సిటా ఆన్లైన్ బుకింగ్ ఇంజిన్, డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్, చెక్-ఇన్, ఆటోమేటెడ్ బోర్డింగ్ కంట్రోల్, బ్యాగేజ్ రికన్సిలేషన్, ఫ్లైయర్ ప్రోగ్రామ్ సేవలను అందిస్తోంది. డాటాపై సైబర్ దాడి, వ్యక్తి గత సమాచారం లీక్ పై ఎయిరిండియా స్పంది స్తూ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతా నికైతే సమాచారం దుర్వినియోగం కాలేదని స్పష్టం చేసింది. లీక్అయిన డేటాలో ప్రయాణీకులు పుట్టిన తేదీలు, పూర్తి పాస్‌పోర్టు సమాచారం, టికెట్ సమా చారం, క్రెడిట్ కార్డు వివరాలు ఉన్నా యి. ఈ డేటా లో 11 ఆగస్టు 2011 నుండి 2021 ఫిబ్రవరి 3 వరకు ఎయిర్ ఇండియా నుండి ప్రయా ణించిన ప్ర యాణీకుల మొత్తం సమాచారం ఉంది. డేటా దుర్వి నియోగం కాకుండా విదేశీ రెగ్యులేటరీ ఎజెన్సీలతో చర్చలు జరుపుతున్నామనీ, ప్రయాణీకులు వారి పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచించింది.