Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది : సుప్రీం
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, సభ్యుల నియామకాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోవటం లేదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా అనేక ట్రిబ్యునల్స్‌లో సిబ్బందిలేక కార్యకలాపాలు కొనసాగటం కష్టసాధ్యంగా మారిందని సుప్రీం తెలిపింది. ట్రిబ్యునల్స్‌లో ఖాళీలను కేంద్రం వెంటనే భర్తీచేయాలని ఆదేశించింది. ట్రిబ్యునల్స్‌లో సభ్యుల కాలపరిమితి సుప్రీం తుది ఆదేశాల ప్రకారం నిర్ణయించాలని కేంద్రానికి సూచించింది. ఇందుకోసంగాను కేంద్రం తగిన ఆదేశాలు జారీచేయాలని తెలిపింది. ట్రిబ్యునల్స్‌లో సభ్యుల కాలపరిమితి నాలుగేండ్లు ఉండాలని కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాగా, కాలపరిమితి ఐదేండ్లు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య ఏర్పడ్డ వివాదం ట్రిబ్యునల్ సభ్యుల నియామకానికి అడ్డంకిగా మారిందని సమాచారం.