Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్లు అందించాలంటూ ఢిల్లీ , మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 57 శాతాన్ని కూడా వినియోగించడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా తెలిపింది. దీంతో మిగిలిన టీకాలు ఏమవుతు న్నాయో అని అయోమయం నెలకుంది. సోమవారం విచారణలో భాగంగా నెలకు 8.5 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి అవుతు న్నాయని కోర్టుకు కేంద్రం తెలిపింది. రోజుకు సగటున 12 నుండి 13 లక్షల వ్యాక్సిన్లను దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామని చెప్పింది. అంటే కేంద్రం తెలిపిన లెక్కల ప్రకారం చూస్తే...రోజుకు 28.33 లక్షల ఉత్పత్తి అవుతుండగా...కేవలం 57 శాతం మాత్రమే ప్రజలకు చేరువౌతుందని అర్ధమౌతోంది. మిగిలిన టీకాలపై అయో మయం నెలకుంది. ఈ నెల 20న విచారణలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కోసం టైమ్ ఫ్రేమ్‌ను అందించాలని కేంద్రాన్ని హైకోర్టు కోరింది. దీనిపై సోమవారం విచా రణ జరగ్గా...వ్యాక్సినేషన్ పాలసీ పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో అందిం చిన కేంద్రం, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇంత మేర టీకాలను ఇవ్వా లన్న నిర్థిష్ట లక్ష్యాన్ని పెట్టుకోలేదని చెప్పింది.