Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తాజా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన 18-44 మధ్య వయస్సులై ఉండి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని వారికి కేంద్రం ఒక సదవకాశాన్ని ఇచ్చింది. టీకా వేయించుకనేందుకు ఆసక్తి ఉన్న వారు...కేంద్రం అభివృద్ధి చేసిన కోవిన్ యాప్లో రిజిస్టర్ చేయించుకునేందుకు, అపాయింట్మెంట్ పొందేందుకు వాక్ ఇన్, ఆన్ సైట్ అవకాశం కల్పిస్తున్నట్లు సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ సెంటర్లకు వెళ్లి పేరు నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. ఇది ప్రైవేట్ కోవిడ్ సెంటర్లకు వర్తించవని చెప్పింది. అది కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.