Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్పైయిస్ జెట్ చార్టరెడ్ విమానంలో వివాహం జరిగిన సంఘటనపై ఆ విమాన సిబ్బందిపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వేటు వేసింది. తమిళనాడులోని మధురైకు చెందిన జంట విమానంలో ఆదివారం వివాహం చేసుకున్నారు. సుమారు 160కు పైగా బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై స్పందించిన డిజిసిఎ ఈ నిర్ణయం తీసుకుంది. 'మేం సిబ్బందిని తొలగించాం. అలాగే కోవిడ్-19 నిబంధనలు పాటించని కారణంగా వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయమని ఎయిర్‌లైన్స్‌కు ఆదేశించాం. మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటాం' అని డిజిసిఎ అధికారి ఒకరు తెలిపారు.