Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధతంగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం సోమవారం నాటికి 179వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం అవుతున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి వందలాది ట్రాక్టర్లతో వేలాది మంది ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. వివిధ రిపోర్టుల ప్రకారం రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు 470 మందికి పైగా రైతులు అసువులు బాసారు.
''బ్లాక్ డే'' డిఎస్ఎంఎం సంపూర్ణ మద్దతు
మే 26న ''బ్లాక్ డే'' నిర్వహించాలని సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపుకు దళిత శోషణ్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆ రోజున దేశవ్యాప్తంగా నిరసన ఆందోళనలో భాగస్వామ్యం కావాలని అన్ని కమిటీలకు పిలుపు ఇచ్చింది. పెద్ద సంఖ్యలో సమీకరించాలని, పిలుపుకు మద్దతుగా ముందుకు వచ్చిన వారందరితో పాటు నిలబడాలని డిఎస్ఎంఎం కోరింది. సోమ వారం ఈ మేరకు డిఎస్ఎంఎం ప్రకటన విడుదల చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్టాన్ని తీసుకు రావాలని, ''కమిషన్ ఫర్ ది ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నేషనల్'' రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల ఆర్డినెన్స్ 2020, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న రైతులు ఆందోళనలు ప్రారంభమై మే 26 నాటికి ఆరు నెలలు పూర్తి అవుతుందని డిఎస్ఎంఎం తెలిపింది.