Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాల్లో ఒక ముస్లిం యువకుడిపై మూకదాడికి పాల్పడ్డారు. రక్షణ కోసం పోలీసులు వద్దకు వెళితే బాధితుడ్నే అరెస్టు చేశారు. మహ్మద్ షాకీర్ అనే ముస్లిం యువకుడిపై కొందరు మూకదాడికి పాల్పడ్డారు. షాకీర్ రవాణా వ్యాపారంతో పాటు గొడ్డు మాంసం అమ్ముతూ ఉంటాడు. దీంతో గొడ్డు మాంసాన్ని అమ్ముతూ, కరోనాను వ్యాప్తి చేస్తున్నారని, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తు న్నాడంటూ కొంత మంది షాకీరపై దారుణంగా దాడికి పాల్పడ్డార. ఈ ఘటనపై బాధితుడు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా...పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే షాకీర్‌పై దాడి చేసిన వ్యక్తులు కూడా ఫిర్యాదు చేయడంతో బాధితుడ్ని అరెస్టు చేశారు. బాధితుడిపౖౖె దాడి చేసిన మనోజ్ ఠాకూర్‌ను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. కాగా, మరో నలుగుర్ని అరెస్టు చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని మొరదాబాద్ పోలీసులు చెప్పారు.
షాకీర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదులో తాము గొడ్డు మాంసాన్ని తీసుకెళుతుంటే....అడ్డుకున్న మనోజ్ పోలీసులకు తెలియకుండా ఉండాలంటే 50 వేల డిమాండ్ చేశాడని చెప్పారు. నిరాకరించడంతో లాఠీలతో కొట్టారని ఫిర్యాదు చేశా రు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.