Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : ప్రస్తుతం తీవ్ర తుఫానుగా ఉన్న యాస్ మరింతగా తీవ్రరూపం దాల్చనున్నదనీ, రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. బుధవారం మధ్యహ్ననికి యాస్ తీరం దాటే అవకాశముందని కోల్కతాలోని ప్రాంతీయ వాతారణ కేంద్రం ప్రకటించింది. గత ఆరు గంటల నుంచి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను కేంద్రం ప్రస్తుతం పారదీప్ (ఒడిశా)కు 280 కిలో మీటర్ల దూరంలో, బాలాసోర్ (ఒడిశా)కు 380 కిలో మీటర్ల దూరంలో, దిఘ (పశ్చిమ బెంగాల్)కు 370 కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరం మధ్య ఈ నెల 26, బుధవారం మధ్యహ్నం అత్యంత తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు, పశ్చిమ మిద్నాపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వీటికి 'రెడ్ వార్నింగ్' హెచ్చరికలు జారీ చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.