Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో దళితునిపై అగ్రవర్ణాల దాడి
అహ్మదాబాద్: దళితులపై దేశంలోని ఏదోఒక చోట నిత్యం దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నా యి. తాజాగా ఓదళిత వ్యక్తం మీసం పెంచుతు న్నందుకు అతనిపై అగ్రవర్ణాల వారు దాడి చేశారు. ఈదారుణ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. అహ్మ దాబాద్లోని విరాంగమ్ ప్రాంతంలో ఉండే సురేష్ వాఘేలా దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఆతను మీసం పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్ర వర్ణాలలకు చెందిన 11 మంది వ్యక్తులు.. సోమవారం రాత్రి సురేష్ వాఘేలా ఇంటికి వచ్చి అతనిపై దాడి చేశారు. అడ్డుకున్న వారి కుటుంబ సభ్యులను సైతం గాయపరిచారు. ఈ దాడిలో సురేష్ వాఘేలాతో పాటు అతని సోదరికి తీవ్రంగా గాయాలయ్యాయి ప్రస్తుతం వీరిద్ధరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పై కేసు నమోదుచేసుకున్నామనీ, ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ సుపరింటెండెంట్ డిఎస్.వ్యాస్ తెలిపారు. త్వరలోనే మిగతా వారిని అదుపులోకి తీసుకుని చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.