Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతితో మరో ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జులైలో జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షను ఐఐటీ ఖరగ్పూర్ వాయిదా వేసింది. తదుపరి పరీక్ష తేదీలను అనువైన సమయంలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జులై 3న జరగాల్సి ఉన్నది. అయితే కరోనా కారణంగా జేఈఈ మెయిన్ మూడు, నాలుగు సెషన్ పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలను నాలుగు విడతలో నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు విడతల పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ఆ తరువాత దేశంలో కరోనా విజృంభించడంతో ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన సెషన్లను వాయిదా వేశారు. వాటిని రీషెడ్యూల్ చేసి త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది.