Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత్‌లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గుజరాత్‌కు వచ్చాయి. మొత్తంగా దేశానికి 81.72 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా.. ఇందులో 37 శాతం లేదా రూ.1.77 లక్షల కోట్లు గుజరాత్‌కు చేరాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు వరుసగా 27 శాతం (రూ.1.53 లక్షల కోట్లు), 13 శాతం (రూ.78వేల కోట్లు)చొప్పున వచ్చాయని పేర్కొంది. తెలంగాణ రూ.11,332 కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. సింగపూర్ నుంచి అత్యధికంగా 29 శాతం ఎఫ్‌డీఐలు రాగా.. అమెరికా నుంచి 23 శాతం, మారిషాష్ నుంచి 9 శాతం చొప్పున వచ్చాయని తెలిపింది.