Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా.. మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. అయితే, కరోనా ఈ స్థాయిలో ప్రభావం చూపడానికి ఇటీవల దేశంలో గుర్తించిన బీ1617 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తీవ్ర స్థాయిలో పంజా విసురుతున్న ఈ వేరియంట్ ప్రపంచంలోని దాదాపు 53కు పైగా దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బుధవారం వెల్లడించింది. అలాగే, మరో ఏడు దేశాల్లోనూ బీ1617 వేరియంట్‌ను గుర్తించినట్టు అనధికారికి సమాచారం తమకు అందిం దనీ, దీంతో మొత్తం ఈ వేరియంట్ విస్తరించిన దేశాలు 60కి చేరాయని డబ్ల్యూ హెచ్‌వో స్పష్టం చేసింది. ఇతర రకాలతో పోలిస్తే బీ1617 వేరియంట్ రెట్టింపు స్థాయిలో వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రభావంపై పరిశోధన జరుపుతున్నామని తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కరోనా వేరియంట్లను గుర్తించారు. అయితే, బీ117 (బ్రిటన్), బీ1351 (దక్షిణాఫ్రికా), పీ1 (బ్రెజిల్), బీ1617 (భారత్) కరోనా వేరియంట్లను అత్యంత ప్రమాదకర రకాలు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ రకాల కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతోందని తెలిపింది. దాదాపు 149 దేశాల్లో బీ117, 102 దేశాల్లో బీ1353, 59 దేశాల్లో పీ1 కరోనా వేరియంట్లు వ్యాపించా యని వెల్లడించింది. ఇక భారత్‌లో ఇటీవల గుర్తించిన బీ1617 వేరియంట్‌ను బీ16171, బీ 16172, బీ16173 అనే మూడు రకాలుగా విభజించింది. మొదటిది 41, రెండోది 54, మూడోది 6 దేశాలకు విస్తరించిందని పేర్కొంది.