Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకం టైటిల్.. మాస్టర్‌స్ట్రోక్ : 420
-వెల.రూ.56.. పేజీలు 56.. తెరిచి చూస్తే అంతా ఖాళీ..అదే ట్విస్ట్..
న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ 'అమెజాన్'లో కొద్ది రోజుల క్రితం అమ్మకానికి పెట్టిన ఒక పుస్తకం చర్చనీయాంశమైంది. ఆ ఈ-బుక్ పేరు 'మాస్టర్‌స్ట్రోక్ : 420 సీక్రెట్స్ దట్ హెల్ప్డ్ పీఎం ఇన్ ఇండియాస్ ఎంప్లారుమెంట్ గ్రోత్'. రచయిత పేరు 'బేరోజ్‌గార్ భక్త్' (దీనర్థం..నిరుద్యోగ హిందూత్వఅతివాది). ఈ- బుక్ ధర రూ.56.. ఇందులోని పేజీల సంఖ్య 56. ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసి చదువుదామనుకున్న వారు షాక్‌కు గురయ్యారు. అసలై
ట్విస్ట్ ఏంటంటే.. ఆ పుస్తకంలో పేజీలన్నీ ఖాళీ ! అన్నీ తెల్ల కాగితాలే. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసిన వ్యంగ్య రచన ఇదని పాఠకుడికి తర్వాత అర్థమవుతుంది. నిరుద్యోగం, కరోనా సంక్షోభం దెబ్బకు దేశం విలవిల్లాడుతుంటే, ఏమీ పట్టనట్టగా.. మోడీ సర్కార్ వ్యవహరించటంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఈనేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ప్రధాని మోడీపై ఈ-బుక్‌ను పై విధంగా రూపొందించి అమ్మకానికి పెట్టారని తెలుస్తోంది. తద్వారా తన ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేశాడని ట్విట్టర్లో అభిప్రాయాలు వెలువడ్డాయి. ఎన్నో వాగ్ధానాలు చేసిన మోడీ సర్కార్ ప్రజల్ని మోసం(420 సీక్రెట్స్) చేసిందని, ఇన్నేండ్లు దేశానికి చేసిందేమీ లేదని చెప్పటం రచయిత అసలు ఉద్దేశం. '' దేశంలో నిరుద్యోగం, కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే..దేశాన్ని కాపాడిన మహానేత ప్రధాని మోడీ! దేశంలో ఉద్యోగ అవకాశాల్ని పెంచడానికి ప్రధాని మోడీ ఏం చేశారన్నది ఈ పుస్తకంలో ఉంది'' అని పుస్తకం కింద డిస్క్రిప్షన్లో రచయిత రాయటం, తీరా పుస్తకంలో ఏమీ లేకపోవటంతో సంచలనం సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై జోకులు పేలుతున్నాయి. అమెజాన్‌లో మే 23న అమ్మకానికి పెట్టగా, మే 25న తొలగించారు.