Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీవర్షాలు
- మధ్యాహ్ననానికి తీరం దాటనున్న తుఫాను
న్యూఢిల్లీ : యాస్ తుఫాన్ బెంగాల్, ఒడిశాలపై విరుచుకుపడుతున్నది. ఒడిశాలోని ధమ్రా, బాలసోర్ మధ్య...కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలో తీరం దాటనున్నది. భీకర తుఫాన్‌గా ఆవిర్భవించిన యాస్ సైక్లోన్ కారణంగా గంటకు 140 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. బాలాసోర్‌కు ఆగేయంగా దిశగా తుఫాను దూసుకువస్తుందని పేర్కొంది. ఈ తుఫాన్ కారణంగా బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కోల్‌కతాతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతంలో సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. ఇటు ఒడిశాలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జగత్సింగ్పూర్, కేంద్రపాదా, భద్రక్, బాలసోర్ జిల్ల్లాలు అధికంగా ప్రభావితమయ్యేట్టు కనిపిస్తున్నది.