Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈపీఎఫ్ నమోదులో 23 శాతం పతనం
- ఈఎస్ఐలో కొత్తగా చేరే వారి సంఖ్య 24 శాతం క్షీణత
- కరోనాకు ముందు నుంచే ప్రభావం
న్యూఢిల్లీ : కరోనాకు ముందే దేశంలో ఉద్యోగాల కల్పన అమాంతం పడిపోయింది. మోడీ ప్రభుత్వ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి విధానాల దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోవడంతో కొత్త ఉద్యోగాల నమోదు తగ్గిపోయింది. వీటికి తోడు కరోనా సంక్షోభం తోడు కావడంతో మరింత గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వ ఎజెన్సీ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో నూతన ఉద్యోగాల నమోదు ఏకంగా 22.56 శాతం పడిపోయింది. ఇదే సమయంలో స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లోనూ 24 శాతం క్షీణత నమోదైంది. కాగా ఇంతక్రితం
ఏడాది 2019-20లోనూ పీఎఫ్ నూతన చందాదారుల నమోదు 21 శాతం క్షీణించింది. ఒక సంస్థలో 20 మందికి పైగా ఉండి.. నెలకు రూ.15వేల లోపు వేతనాలు పొందింతే ఈపీఎఫ్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఏదైనా పరిశ్రమలో 10 మంది పైగా ఉద్యోగులు ఉన్న ఈఎస్ఐసీ తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. సీఎంఐఈ రిపోర్టు ప్రకారం.. కరోన సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి 1.26 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక సంవత్సరం 2019-20 ముగింపు నాటికి దేశంలో 8.59 కోట్ల వేతన జీవులున్నారు. ఈ సంఖ్య 2021 ఏప్రిల్ ముగింపు నాటికి 7.33 కోట్లకు తగ్గిపోయింది. జాతీయ గణంకాల సంస్థ (ఎన్ఎస్ఓ) మంగళవారం వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం 2020-21లో ఇఎస్ఐ స్కీమ్‌లో 1.15 కోట్ల మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారనీ.. గత మూడేండ్లలో ఇదే అత్యల్పమని తెలిపింది. 2018-19లో కొత్తగా నమోదైన వారి సంఖ్య 1.49 కోట్లు, 2019-20లో 1.51 కోట్లుగా ఉంది.