Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాలో విదేశాలకు ఆహారధాన్యాల ఎగుమతులు
- ఏడాదిపాటు 25 కోట్లమంది రేషన్ ఇవ్వొచ్చు
- దేశప్రజల సంగతేంటీ..?మోడీ సర్కార్ నిర్లక్ష్యమే : ప్రజాసంఘాలు
దేశప్రజలపై కోవిడ్ వైరస్ విరుచుకుపడుతుంటే..మోడీ సర్కార్ మాత్రం విదేశాల గురించే బెంగపెట్టుకుంటున్నది. ఏడుకోట్ల వ్యాక్సిన్ వయల్స్ అడగకపోయినా పంపారు. దేశమంతా వ్యాక్సిన్ కొరతతో ప్రాణాలు తోడేస్తున్నది. తాజాగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించటంతో.. వలసకార్మికులు, బీదాబిక్కి జనం ఆకలికేకలు పెడుతున్నారు. పస్తులుండలేక అల్లాడిపోతుంటే.. బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పండిన ఆహారధాన్యాలను ఎగుమతిచేసేసింది. ఇదంతా మా ప్రతిభ అంటూ దేశప్రజల్ని మాత్రం గాలికొదిలేస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తు న్నారు. అయినా కేంద్రంలోని బీజేపీపాలకులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలను ఎగుమతి చేయడం చూస్తే ఈ ప్రభుత్వానికి ప్రజల బాధలు పట్టవా అనిపిస్తూంది. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో చేసి ఆహార ధాన్యాల ఎగుమతులు దేశంలో 25 కోట్ల మందికి ఒక సంవత్సరం పాటు రేషన్ ఇవ్వడానికి సరి సమానంగా ఉన్నది. కోవిడ్ మహహ్మారి గ్రామాలకు వ్యాపించడం, దేశంలో ఎక్కువ ప్రాంతాలలో లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమ య్యాయి. ప్రత్యేకించి అసంఘటిత రంగ కార్మికుల ఎక్కువ నష్టపోతున్నారు. 2020 కంటే ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైనది. కారణం ఎక్కువ కుటుంబాల ఆరోగ్య సమస్యలు పెరిగిపోవడం వైద్యం ఖర్చు కూడా తడిసి మోపడైంది. ఇప్పుడు ఉద్యోగాలు పోవడం, ఉన్నా వారికి జీతాలు తగ్గిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది.
ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ పథకం కింద రేషన్ కార్డు ఉన్న వారికే 2 నెలల కోసం అదనపు రేషన్ ఇస్తున్నారు. ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులు అసలు రేషన్ కార్డులు లేవు. ఇది చూడటం లేదు. ప్రతి కుటుంబానికి ఆరు నెలల పాటు 5 కిలోల బియ్యం 1.5 కిలోల పప్పుదాన్యాలు, 800 గ్రాముల నూనె రేషన్లో ఇచ్చి వాటికి అదనంగా ఆరు నెలల పాటు ఇస్తే ప్రజలకు కొంతలో కొంత ఉపశమనం అవుతుంది. ఈ దారుణ పరిస్థితిలో ప్రభుత్వం ఆహార దాన్యాలు ఎగుమతి చేయడం ఆశ్చర్యం కల్గిస్తుందని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని బట్ట బయలు చేస్తున్నది. కోటి నలభై లక్షల టన్నుల బాస్మతి ఇతర బియ్యం నలబై లక్షల టన్నుల బాస్మతి బియ్యం, రెండు లక్షల తొంబై వేల టన్నుల గోదుమలు ఈ ఏడాది ఇప్పటికే ఎగుమతి చేసింది. ఇక్కడ తినటానికి లేదు కానీ విదేశాలకు ఎగుమతులు చేసింది. మరో అంశం ఎఫ్సీఐకి ఒక కిలో బియ్యం నిల్వ సంరక్షణకు రూ 37 అయితే ఎగుమతి రేటు మాత్రం కిలోకి రూ. 27కే ఇచ్చి నష్టపోతున్నది. ఇది అదనపు భారమవుతున్నది. ప్రజల పొట్ట నింపకుం డా, ప్రభుత్వం ఎగుమతులకు పాల్పడుతున్నది లేక పోతే ఇథనాల్ ఉత్పత్తికి ఆహారధాన్యాలను మళ్లిస్తున్నది.
ఇంత దారుణానికి ఓడికడుతున్నది. ఈక్లిష్ట పరిస్థితిలో ప్రతి కుటుంబానికి 25 కిలోల ఆహార దాన్యాలు ఆరు నెలల కోసం ఇవ్వాలి. ఉచిత సార్వజనిత ఆహార దాన్యాల పంపిణి ఏర్పాటు చేసి ఆహార భద్రతకు పూనుకోవాలి. ఉపాధి అవకాశాల కాపాడే కనీస బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.