Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధానికి
ఐఎంఏ లేఖ.. పరువు
- నష్టం దావా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉన్నకరోనా మమమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే ఆరో గ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇలాంటి సమయంలో ప్రజ లను అప్రమత్తం చేయాల్సిందిపోయి.. పలువురు అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయడంతో భారత్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ఇటీవల పలువురు బీజేపీ నాయకులు కరోనాపై అనేక అశాస్త్రీయమైన అం శాలను ప్రచారం చేశారు. దీనిపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన సైతం వ్యక్తంచేశారు. పతాంజలి రామ్‌దేవ్ బాబా ఇటీవల అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపు తున్నాయి. అల్లోపతి వైద్యంతో పాటు వైద్యులను కించపరి చేలా ఆయన చేసిన వ్యాఖ్యలను యావత్ దేశ వైద్యరంగం ముక్తకంఠంతో ఖండించింది. ఆయుర్వేద మందులను తయారు చేసే పతాంజలి కోసమే.. ప్రజల ప్రాణాలలో చెల గాటం అడుతూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనీ, అధికార నేతల అండతో శాస్త్రీయ వైద్యంపై ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరువు నష్టం దావా
రామ్‌దేవ్ ఇటీవల చేసిన ప్రకటనల్లో ''అల్లోపతి వైద్యం విఫలమైంది, ప్రభుత్వం ఆమోదం తెలిపిన మందులు తీసు కున్న తర్వాత కూడా లక్షల మంది మరణించారు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 10 వేల మందికి పైగా వైద్యులు మరణించారు.. ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోవడం వారి తప్పే ఎందుకంటే వారికి సరిగ్గా ఊపిరి పీల్చుకోవడం తెలియదు'' అనేవి తీవ్ర వివాదాస్పదమయ్యా యి. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా స్పందిస్తూ.. శాస్త్రీయ వైద్య విధానంపై తప్పుడు ప్రచారం చేస్తున్న రామ్‌దేవ్ బాబాపై ఎపిడెమిక్ డీసీజెస్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాని డిమాండ్ చేసింది. అలాగే, ఆయన వెంటనే క్షమాపణలు చెబుతూ.. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. తాజాగా ఐఎంఏకు చెందిన ఉత్తరాఖండ్ వైద్య సంఘం రామ్‌దేవ్ బాబాకు రూ.వెయ్యి కోట్ల పరువునష్టం నోటీసులు ఇచ్చింది. రామ్‌దేవ్ తాను చేసిన వ్యాఖ్యలపై 15 రోజుల్లోగా వీడియో రూపంలో సమాధానం చెబుతూ.. రాతపూర్వకంగా క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేసింది. రామ్‌దేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి ఐఎంఏ లేఖ రాసింది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదుచేయాలంటూ పలువురు ప్రతినిధిలు పేర్కొన్నారు.
అధికార పార్టీ అండతో..
రామ్‌దేవ్ బాబాకు అధికార పార్టీ అండ గట్టిగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు ఆయన కరోనా మందుగా ప్రచారం చేస్తూ కరోనిల్‌ను తీసుకువచ్చారు. ఇది ఏడు రోజుల్లో కరోనాను తగ్గిస్తుందని విస్తృత ప్రచారం సైతం చేశారు. ఈ మందును కేంద్ర మంత్రులు హర్షవర్థన్, నితిన్ గడ్కరీలు చేతుల మీదుల విడుదల చేయడం గమనార్హం. అయితే, ఈఔషధం కరోనా తగ్గిస్తుందని ఎలాంటి ఆధారాలు లేవనీ, ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లేదని సంబంధిత అధికారులు వెల్లడిండించారు. ఈ వ్యవహారంలో రామ్‌దేవ్ బాబాపై కేసులు సైతం నమోదయ్యాయి. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోలేదు. మరోవైపు బీజేపీ పాలిత హర్యానా ప్రజా ధనాన్ని ఉపయోగిస్తూ కరోనిల్‌ను కొనుగోలు చేసి.. పౌరులకు అందిస్తుండటం గమనార్హం.
రాం దేవ్ బాబ : యోగా గురు రామ్‌దేవ్ తో విసిగి పోయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ పంపింది. దయచేసి వ్యాక్సినేషన్ పై రామ్ దేవ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపించాలంటూ పేర్కొం ది. దీనిపై తగిన యాక్షన్ తీసుకుని అడ్డుకోవాలంటూ కోరుతుంది. పీఎంమోడీని అడ్రస్ చేస్తూ రాసిన లెటర్?లో.. ఈ విషయాన్ని బాధతో మీ దగ్గరకు తీసుకురావాల్సి వస్తుందని పేర్కొంది. 'ఆ వీడియోలో 10వేల మంది డాక్టర్లు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా చనిపోయారు. లక్షల మంది అల్లోపతి మందులు వాడి ప్రాణాలు కోల్పోతున్నారు' అని చెప్తున్నట్లుగా ఉంది.
ఈ ఆరోపణలన్నీ రామ్ దేవ్ చేసినట్లుగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు రామ్‌దేవ్ బాబా 25 ప్రశ్నలు సంధించారు. అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని.. ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని గుర్తు చేస్తూ 25ప్రశ్నలు సంధించారు.