Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం చాలామంది జీవితాల్లో విషాదాన్ని నింపిందనీ, బాధలను తీసుకురావడంతో పాటు ఆర్థికంగా పెను ప్రభావం చూపిందని ప్రధాని మోడీ అన్నారు. తాజాగా జరిగిన వేసక్ దినోత్సవం వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. కోవిడ్-19 ప్రతి దేశాన్నీ దెబ్బతీసిందని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ప్రపంచం ఒకేలా ఉండదనీ.. పెను మార్పులు కనిపిస్తాయని తెలిపారు. ప్రాణాలను కాపాడటానికి, కరోనా మహమ్మారిని ఓడించటానికి టీకాలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిందనీ, ఆర్థిక పునరుద్ధరణ చర్యలను తీవ్రంగా అడ్డుకుందన్నారు.