Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహానాడులో చంద్రబాబు విమర్శ
అమరావతి : ఏపీలో స్టేట్ టెర్రరిజం నడు స్తోందని, ప్రభుత్వ తప్పిదాలపై ఎవరు మాట్లాడితే వారి నోరు మూయించే ప్రయ త్నం పోలీసులతో చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. డిజిటల్ పద్ధతిలో గురువారం ప్రారంభమైన మహానాడులో ఆయన హైదరాబాద్లోని తన నివాసం నుంచి ప్రసంగించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం బాబు మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయని, కోర్టులను కూడా ప్రభుత్వం బెదిరిస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దెందలూరి ప్రభాకర్, జెసి ప్రభాకర్ రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర, రామకృష్ణా రెడ్డి, బీటెక్ రవి, బీసీ జనార్ధన్ రెడ్డిలను తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారన్నారు. అధికార పార్టీ ఎంపి రఘురామకృష్ణమ రాజును, పోలీస్ కస్టడీలోనే డాక్టర్ సుధాకర్ చేసిన నేరం ఏంటి? మాస్క్ ఆడిగిన పాపానికి పిచ్చి వాడిని చేసి హింసించి హింసించి చనిపోయేలా చేశారన్నారు . వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటు గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని వైసిపి నాయకులు బలిగొన్నారని , కోడెల శివప్రసాద్ ను వేధించి ఆత్మహత్య చేసుకొనేలా చేశారన్నారు. రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రం ఉందా? అని ప్రశ్నించారు. తిరుపతి రుయా ఆసుపత్రుల్లో 32 మంది చనిపోయారని పేర్లతో సహా ఇస్తే ప్రభుత్వం మాత్రం 11 మంది చనిపోయారని తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికారణంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చనిపోయిన కరోనా బాధితులకు అంత్యక్రియులు కూడా చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు ఈ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కున్న పార్టీగా మేము సలహాలు ఇస్తాం, కలిసి పని చేద్దామంటే కనీసం తీసుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.