Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పరారీలో ఉన్న మెహుల్ ఛోక్సీ నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయ్యారు. భారత్ నుంచి పరారయ్యేనాటికే అంటిగ్వా - బార్బుడా పౌరసత్వం కలిగియున్న అతను ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు. అయితే ఆదివారం అక్కడి నుంచి అదృశ్యమై పక్కనే ఉన్న కరేబియన్ దేశం డొమినికాలో తేలారు. మీడియా కథనాల ప్రకారం డొమినికా రాజధాని రొసెవులోని కేన్ఫీల్డ్ బీచ్లో మంగళవారం రాత్రి ఏవో కాగితాలు సముద్రంలోకి పారేస్తుండగా భద్రతాధికారులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని డొమినికా ప్రధానమంత్రి కార్యాలయం గురువారం ధ్రువీకరించింది.
డొమినికా పౌరసత్వం లేనందున అంటిగ్వాకు అప్పగించే అవకాశముంది. అయితే ఛోక్సీని నేరుగా భారత్కు అప్పగించాల్సిందిగా అంటిగ్వా - బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌవ్నే డొమినికా ప్రభుత్వానికి సూచించినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఛోస్కీ 2018 జనవరిలో భారత్ నుంచి తప్పించుకుని పారిపోయిన సంగతి తెలిసిందే.