Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: సి జనార్థన్ లాంటి ఉదార గుణం ఉన్న వాళ్ళు ఉంటే కరోనా లాంటి మహమ్మారిపై యుద్ధాన్ని ప్రభుత్వం ఎందుకు చేయలేదు. ప్రభు త్వం ఎంతకైనా తెగిస్తుంది. ప్రజలందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తుంది. కేరళలలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వండని పిలుపు ఇవ్వక పోయినా ప్రజల నుంచి ఊహించని విధంగా స్పందన వచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు జమ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతానికి వెంటనే కోటి వ్యాక్సిన్లను కొనుగోలు చేసి మరో మూడు కోట్ల వ్యాక్సినేషన్ల కోసం గ్లోబల్ టెండర్‌కు పిలుపును ఇచ్చింది.
కేరళలో బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి వి. మురళీధరన్ కేరళ రాష్ట్ర ప్రభుత్వంను సవాలు చేసి మీ దగ్గర 18-45లోపు వారికి వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ ఇవ్వము మీ కావాల్సిన వ్యాక్సిన్లు మీరు కొనుక్కో వాలి అని బల్లగుద్ది ప్రకటించారు. దానికి స్పందనగా సోషల్ మీడియాలో వ్యాక్సిన్ కోసం సవాల్‌ను స్వీకరిస్తూ కొందరు పూనుకుని ప్రయత్నం ప్రారంబించారు. ఇది చూసిన వారు వ్యాక్సిన్ల కోసం తమ వంతు సహాయం చేయడానికి ముం దుకు వచ్చారు. అలాంటి వారే సి.జనార్థన్. సుబేదాలు, దాని కొనసాగింపుగా కేరళ వాళ్ళు విదేశాల్లో ఉన్నవారు, దేశంలో నలుదిక్కులా ఉన్న వాళ్ళు స్పందించారు. సినిమా ప్రముఖులు కూడా తోడైన్నారు. తాము తీసుకున్న రెండు డోసుల వ్యాక్సిన్ లకు అయ్యే డబ్బులు వారే చెల్లించారు. ఈ క్యాంపైన్‌కు ప్రభావితుడైన కేరళలో జనార్థన్ అనే బీడీ కార్మికుడు బ్యాంకుకు వెళ్ళి తన బ్యాంక్ పాస్‌బుక్ చూపించి బ్యాంక్ మేనేజర్‌ను అందులో నుంచి రెండు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయమని కోరాడు. మేనేజర్ అలా చేస్తే నీకు చాలా తక్కువ మొత్తం మిగులుతుంది. ఆలోచించుకో మన్నా ఆయన తన మాటకీ కట్టు బడటంతో మేనేజర్ బదిలీ చేయడం తప్పలేదు. జనార్థన్ 35 సంవత్సరాల నుంచి బీడీ కార్మికుడుగా పని చేస్తున్నారు. ఆయన భార్య కూడా పని చేసేది. ఆమె చని పోతే వచ్చిన డబ్బులే ఆ రెండు లక్షల రూపాయలు వాటిని ఆయన సహాయనిధికి ఇచ్చి ఉదారత చాటుకున్నారు. మరో సంఘటనలో సుబైదా అనే మేకలు పెంచుకునే రైతు రెండు మేకలు ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేసింది.
అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహాయనిధి ఇవ్వండని పిలుపు ఇవ్వలేదు. జనార్తన్, సుబైదా స్వచ్చందంగా కరోనా నివారణ కోసం ఖర్చులకు ముఖ్మంత్రి సహాయ నిధికి జమ చేశారు. ఈ విషయం ఆనోట ఈనోట పత్రికల వారికి చేరి పత్రికలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేశారు. రూ 35.91 కోట్లు సర్కారు ఖజానాలో సమకూరాయి.
ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా పినరరు విజయన్ ప్రమాణ స్వీకారం వేదిక పైన జనార్థన్, సుబేదాలను కూర్చోపెట్టి గౌరవించారు. ఇది కేరళ ప్రజల చైతన్యానికి నిదర్శంగా ఉన్నది. ఇప్పటికే కేరళ 1,37,580 డోసుల కోవ్యాగ్జిన్ కొనుగోలు చేసింది. మే 12న భారత బయోటెక్ నుంచి మందులు కేరళ చేరుకున్నాయి. మరో 3,76,100 డోసులు త్వరలో అందుతాయి. ఇంతకు ముందే కోవిషీల్డ్ 3.5 లక్షలు కేరళ చేరుకున్నాయి. 9 లక్షల డోసులు మాత్రమే మొదటి దశలో కొనుగోలు చేయవచ్చిన కంపెనీలు తెలియజేసాయి. మిగతా వ్యాక్సిన్ల కోసం మే 12న గ్లోబల్ టెండర్ పిలువబడ్డది. అవి అందిన వెంటనే 18-45 వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్లు ఇవ్వబడతాయి. ఏదైనా రెండు వ్యాధులు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.