Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ - డీ- గ్లూకోజ్) ఔషధం ధర ఖరారైంది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధం ఒక్కో సాచెట్ ధర రూ.990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించినట్టు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్టు వెల్లడించింది. అయితే ఆ డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు. 2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్డీఓ ఆధ్వర్యంలోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్' (ఇన్మాస్) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కరోనా బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్టు డీఆర్డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది. ఈ నెల 17న తొలి విడత కింద 10వేల సాచెట్లను, 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది.