Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ నూతన అసెంబ్లీ ప్రారంభోత్సవ ప్రసంగంలో గవర్నర్
తిరువనంతపురం : దూరదృష్టి గల అభివృద్ధికి కేరళ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహమ్మద్్ ఖాన్ స్పష్టం చేశారు. కేరళలో నూతనంగా ఎన్నికైన 15వ అసెంబ్లీ సమావేశాలను శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ తన ప్రసంగం లో ప్రభుత్వ విధానాలను ప్రకటిం చారు. ముందుగా ఈ సమావేశాలకు విచ్చేసిన గవర్నర్కు ముఖ్యమంత్రి పినరయి విజయన్, స్పీకర్ ఎంబి రాజేష్, అసెంబ్లీ వ్యహారాల మంత్రి కె.రాధాకృష్ణన్ స్వాగతం పలికారు. నూతన అసెంబ్లీ ప్రారంభోత్స వం సందర్భంగా గవర్నర్ ప్రసం గిస్తూ సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సామాజిక-ఆర్థిక అసమా నతలను నిర్మూలిస్తుందని తెలిపారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుందని చెప్పారు. అలాగే, మూడు కోట్ల కోవిడ్ టీకా డోసులకు గ్లోబుల్ టెండర్ పిలించిందని, ఉచిత, సార్వత్రిక, వేగ వంతమైన కోవిడ్-19 టీకాను ప్రజలకు అందిస్తుందని తెలిపారు. కేసులు పెరిగినప్పటికీ మరణాలను 6,612కు పరిమితం చేసిందని తెలిపారు. వచ్చే ఐదేండ్ల లో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకనామీగా మార్చడమే లక్ష్యమని, ఉన్నత విద్యా రంగంలో భారీ పెట్టుబడులు పెట్టనుందని వెల్లడించారు. పంటలకు మద్దతు ధర పెంచుతామని, ఇందులోకి ఎక్కువ పంటలను తీసుకుని వస్తామని చెప్పారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యం పెంచడానికి రూ 1000 కోట్లను వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు.