Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిలీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి అత్యు న్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్ ఎగ్జామి నేషన్పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని జస్టిస్ గవారు, జస్టిస్ సూర్య కాంత ధర్మాసనం తెలం గాణ ఏసీబీని ఆదేశించింది. నాలుగు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ స్టీఫెన్సన్తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి.ఈ కేసుకు సంబంధించి రేవంత్రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు.ఇక, ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విరామం తరువాత ఎన ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో చార్జిషీటును దాఖలు చేసిన విషయం విదితమే.