Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణ,ఏపీ భవన్ ఉద్యోగులకు కరోనా టీకాల వేశారు. శుక్రవారం రెసిడెంట్ కమిషనర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు భవన్ లలో పనిచేస్తున్న.. 45 ఏండ్లు పైబడిన అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని మొదటి విడత కోవిడ్-19 టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఇరు భవన్ ల అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భావనా సక్సేనా మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 108 అంబ్యులెన్స్ సేవల సదుపాయాన్ని అందిస్తున్నామనీ, కోవిడ్-19ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి టీకాను మించిన ఆయుధం లేదని అన్నారు. తెలంగాణ భవన్ కు చెందిన 15 మందికి,ఏపీకి చెందిన 25 మంది ఉద్యోగులకు టీకా వేశారు. ఈ కార్యక్రమానికి లేడి హార్డింగ్ మెడికల్ కాలేజ్ (ఎల్ హెచ్ఎంసీ)లోని సుచేత కృపలానీ హాస్పిటల్ (ఎస్ఎస్కెహెచ్) ఫిజియాలజీ విభాగంలోని వైద్యుడు మన్వీర్ సింగ్ మాథుర్, ఏపీ భవన్ వైద్య సిబ్బంది డాక్టర్ గ్రేస్, జోషిలు వైద్య సహకారం అందించారు.