Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్-19 రోగులలో ఆస్పత్రి ఇన్ఫెక్షన్లు, సెకండరీ ఇన్ఫెక్షన్లు వారి మరణాలకు కారణమవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సెకండరీ ఇన్ఫెక్షన్తో ఉన్న కోవిడ్-19 రోగుల్లో 56 శాతం మంది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లతో చనిపోయారని తేలింది. సెకండరీ ఇన్ఫెక్షన్లను కలిగిన కోవిడ్-19 పేషంట్లలో సగం మంది మృతి చెందినట్టు వెల్లడించింది. వీరంతా ఐసీయూలో చేరిన రోగులని వెల్లడించింది. గతేడాది జూన్-ఆగష్టు మధ్య నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ట్రీట్మెంట్ సమయంలోనే చాలా మంది కరోనా రోగుల్లో సెకండరీ బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వృధ్ది చెందాయి. దాంతో కరోనా రోగుల్లో సగం మందికి పైగా చనిపోవడానికి కారణమైంది. కోవిడ్-19 రోగుల్లో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రిలో పొందిన అంటువ్యాధులు, బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోమైకోసిస్ ఇన్ఫెక్షన్లు కూడా అధ్యయనంలో రికార్డయ్యా యి. ఐసీఎంఆర్ అధ్యయనంలో 17,534 మంది రోగులను అధ్యయనం చేశారు. ఇందులో 3.6 శాతం మంది రోగులలో సెకండరీ బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వృద్ధి అయ్యాయి. ఈ రోగులలో మరణాలు 56.7 శాతంగా ఉన్నాయి. ఇక సెకండరీ ఇన్ఫెక్షన్లు ఉన్న కరోనా రోగులలో సగం మంది మర ణించారు. ఆస్పత్రులలో చేరిన కోవిడ్-19 రోగుల మరణాలతో పోల్చుకుంటే సెకండరీ ఇన్ఫెక్షన్ల మరణాల రేటు చాలా రెట్లు అధికంగా ఉన్నాయి.