Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, లాక్డౌన్ నిబంధనలతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్ర మలు (ఎంఎస్ఎంఈ)లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అం దులోనూ మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈల కష్టాలు మరీ తీవ్రంగా ఉన్నాయి. 2020 నుంచి అమలవుతున్న లాక్డౌన్ నిబంధనల వల్ల దేశంలోని దాదాపు 11 శాతం మహిళల ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. క్రియా యూనివర్సిటీ రీసెర్చ్ సర్వే ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం ఒక్క శాతం సంస్థలకు మాత్రమే మద్దతు లభించింది. లాక్డౌన్ నిబంధనలతో 2020 ఏప్రిల్ నుంచి గడిచిన మార్చి కాలంలో దాదాపుగా 1.7 కోట్ల నుంచి 1.93 కోట్ల మంది మహిళలు నిరుద్యోగులుగా మారారు. ఇందులో చిన్న పరిశ్రమలు, టైలర్, డ్రెస్ మకర్స్, షాప్కీపర్స్, బ్యూటీ పార్లర్ యాజమానులు, ఉద్యోగులు ఉన్నారు. లాక్డౌన్ ముందు నాటితో పోల్చితే 43 శాతం ఉపాధి పడిపోయింది. ఈ సంస్థ 2,083 ఎంఎస్ఎంఈలను సంప్రదించి సర్వే చేసింది. ఇందులో 44.6 శాతం పాక్షికంగా అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. మరో 36 శాతం తాత్కాలికంగా మూతపడ్డాయి. 10.9 శాతం సంస్థలు పూర్తిగా మూతకు గురయ్యాయి. బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వారు ఎక్కువగా ప్రభావితం అయ్యారని వెల్లడించింది.